ఏదైనా డిగ్రీ అర్హతతో హైదరాబాద్, కేంద్ర ప్రభుత్వ మింట్ లో ఉద్యోగాలు.. భారీగా వేతనం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SPMCIL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 15

*ఇందులో పలు రకాల ఉద్యోగాల ఖాళీగా ఉన్నాయి. సూపర్ వైజర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఎంగ్రేవర్ పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*దరఖాస్తుకు చివరి తేది: 2021 డిసెంబర్ 27. 
*సూపర్ వైజర్ ఉద్యోగానికి సంబంధించి డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకి రూ.27600 నుంచి 95910 రూపాయలు చెల్లిస్తారు.
*ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ(బీఎస్సీ) పాసై ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం రూ.21540-రూ.77160 చెల్లిస్తారు.
*ఎంగ్రేవర్ ఉద్యోగానికి సంబంధించి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(స్ల్కప్చర్‌, పెయింటింగ్‌)  లో పాసై ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 18-28 ఏళ్లు ఉండాలి. వేతనం రూ.23910-రూ.85570 చెల్లిస్తారు.
*ఉద్యోగ ఎంపిక కోసం ఆన్ లైన్ ఎక్సామ్ నిర్వహిస్తారు. అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://igmhyderabad.spmcil.com వెబ్ సైట్ ను చూడొచ్చు.