హైదరాబాద్‌, మిధానీలో ఉద్యోగాలు, దరఖాస్తుకు రెండు రోజులే గడువు..

నిరుద్యోగులకు మంచి అవకాశం. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధానీ).. లో 64 ఖాళీల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఉద్యోగ ముఖ్య సమాచారం:

మిధానిలో పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలున్నాయి.

1.సీనియర్‌ ఆపరేటివ్‌ ట్రెయినీలు–33,

2.జూనియర్‌ ఆపరేటివ్‌ ట్రెయినీలు–28,

3.చార్జర్‌ ఆపరేటర్‌–01,

4.రీఫ్యాక్టరీ మేషన్‌–02 వెకన్సీలు ఉన్నాయి.

 * ఉద్యోగ అర్హతకు సంబంధించి పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఐటీఐ, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

* ఉద్యోగాన్ని బట్టి వయోపరిమితి ఉంటుంది. నోటిఫికేషన్ ఆయా జాబ్ ను అనుసరించి వయస్సు 30 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.

* అకడమిక్‌ మార్కులు, వర్క్  ఎక్సిపీరియన్స్,  ఎక్సామ్ స్కిల్స్,  ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

*ఉద్యోగానికి ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేది 2021 సెప్టంబర్18

* దరఖాస్తు కోసం https://midhani-india.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..