ఐఐటీ హైదరాబాద్ లో జాబ్స్, 2లక్షలకు పైనే వేతనం

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. 24 నాన్‌ టీచింగ్‌ పోస్టుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేది: 2021 అక్టోబర్ 11.

ఉద్యోగ ముఖ్య సమాచారం:

*ఉద్యోగాన్ని బట్టి వయోపరిమితి 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

*ఉద్యోగాన్ని అనుసరించి సంబంధిత విభాగాల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌/ఎంసీఏ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఈ/ఎంటెక్, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.

*సంబంధిత విభాగాల్లో ఎక్సిపీరియన్స్ కలిగి ఉండాలి.

*వివిధ రకాల ఉద్యోగాల ఖాళీలున్నాయి.

1.ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–01

2.సీనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌–01

3.జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌–01

4.జూనియర్‌ సైకలాజికల్‌ కౌన్సిలర్‌–01

5.జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌)–02

6.జూనియర్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌)–02

7.టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ –07

8.జూనియర్‌ టెక్నీషియన్‌–08

9.మల్టీ స్కిల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ 1(ఎలక్ట్రికల్‌)–01.

*పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 18,000 నుంచి రూ.2,08,700 వరకు జీతం చెల్లించనున్నారు.

* షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ కోెసం www.iith.ac.in వెబ్ సైట్ ను చూడోచ్చు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..