డిగ్రీ అర్హతతో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఉద్యోగాలు.. త్వరపడండి..

డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISC ) కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*మొత్తం ఉద్యోగాల సంఖ్య: 14

*ఇందులో ప్రాజెక్ట ట్రెయినీ ఉద్యోగాలు ఖాళీగా  ఉన్నాయి.

*దరఖాస్తుకు చివరి తేది: 2021 డిసెంబర్ 14. 
*వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్(ఎల్ఐఎం), ఇన్ఫర్మేషన్ రీసోర్స్ మేనేజ్ మెంట్ విభాగాల్లో పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఎంఎల్ఐఎస్సీ, ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 2021 డిసెంబర్ 14 నాటికి 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://iisc.ac.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.