ఐటీఐ, డిప్లొమా పాస్ అయ్యారా.. అయితే ఉద్యోగం మీదే..

కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(ఎన్‌సీఆర్‌టీసీ).. లో పలు పోస్టుల భర్తీకి  ఒప్పంద ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదలైంది. ఆపరేషన్స్, మెయింటెనెన్స్‌ స్టాఫ్‌  విభాగాల్లో ఉద్యోగ ఖాళీలున్నాయి.  ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: 2021 సెప్టంబర్ 30.

ఉద్యోగ ముఖ్య సమాచారం: 

మొత్తం 226 ఉద్యోగాలకు గాను పలు రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

1.మెయింటెనెన్స్‌ అసోసియేట్‌– 62

2.ప్రోగ్రామింగ్‌ అసోసియేట్‌ – 04

3.టెక్నీషియన్‌– 93

4.స్టేషన్‌ కంట్రోలర్‌/ట్రెయిన్‌ ఆపరేటర్‌/ట్రాఫిక్‌ కంట్రోలర్‌– 67

* ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగాల్లో  ఐటీఐ(ఎన్‌సీవీటీ /ఎన్‌సీవీటీ), మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.

* వివిధ ఉద్యోగాలను బట్టి వివిధ వేతనాలున్నాయి.

– మెయింటెనెన్స్‌ అసోసియేట్‌/ప్రోగ్రామింగ్‌ అసోసియేట్‌/స్టేషన్‌ కంట్రోలర్‌ పోస్టులకు నెలకు రూ.35,250

-ట్రెయిన్‌ ఆపరేటర్‌ పోస్టులకు నెలకు రూ.37,750,

-టెక్నీషియన్‌ పోస్టులకు నెలకు రూ.23,850 చెల్లిస్తారు.

పోస్టుల్ని అనుసరించి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, సైకోమెట్రిక్‌ టెస్ట్, మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా ఉద్యోగానికి ఎంపికచేస్తారు.

ఉద్యోగ దరఖాస్తు కోసం https://ncrtc.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..