బీటెక్, పీజీ డిప్లొమా అర్హతతో NTPCలో ఉద్యోగాలు.. అప్లై చేయండి…

బీటెక్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) నిర్ణీత కాల ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*ఉద్యోగ ఖాళీల సంఖ్య: 03. 
*దరఖాస్తుకు చివరి తేది: 2021 డిసెంబర్ 08
*ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కార్పొరేటర్ కమ్యూనికేషన్), ఎగ్జిక్యూటివ్ (ఐటీ డెవలపర్) పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
*సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి సంబంధించి కమ్యూనికేషన్, అడ్డర్టైజింగ్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్ మెంట్, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా పాసై ఉండాలి. సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ కల్గి ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 55 ఏళ్లు మించకూడదు.
*ఎగ్జిక్యూటివ్‌ (ఐటీ డెవలపర్‌)  ఉద్యోగానికి సంబంధించి  కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీలో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ పాసై ఉండాలి. సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ కల్గి ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 35  ఏళ్లు మించకూడదు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి https://www.ntpc.co.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.