డిప్లొమా ఇంజనీరింగ్ అర్హతతో ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు..

ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, నవరత్న కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో పలు విభాగాల్లో డిప్లొమా అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగాల సంఖ్య: 146

*దరఖాస్తుకు చివరి తేది: 2021 డిసెంబర్ 09. 

*వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, కెమికల్, సివిల్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

* విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా పాసై ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష నిర్వహిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.oil-india.com వెబ్ సైట్ ను చూడొచ్చు.