ఆంధ్రప్రదేశ్ ఆ జిల్లా వైద్య శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ రోజే చివరి తేది…

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(APVVP).. ప్రకాశం జిల్లా ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగాల సంఖ్య: 80

*దరఖాస్తుకు చివరి తేది: 2021 నవంబర్ 29

*ఇందులో పలు రకాలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌–03, ఫిజియోథెరపిస్ట్‌–01, జూనియర్‌ అసిస్టెంట్‌/డీఈఓ–07, రికార్డ్‌ అసిస్టెంట్‌/మెడికల్‌ రికార్డ్‌ అసిస్టెంట్‌–03, ఆఫీస్‌ సబార్డినేట్‌/క్లాస్‌4–08, పోస్ట్‌మార్టమ్‌ అసిస్టెంట్‌–04, రేడియోగ్రాఫర్‌–07, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌2–19, థియేటర్‌ అసిస్టెంట్‌–08, ల్యాబ్‌ టెక్నీషియన్‌–17, ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌–03 పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, డీఎంఎల్ టీ, బ్యాచిలర్ డిగ్రీ, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ పాసై ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

*ఉధ్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 12000 నుంచి రూ.28000 వరకు చెల్లిస్తారు.

*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును The District Coordinator of Hospital Services (APVVP) Old Rims Campus, Opposite Collectorate, Ongole, Ap చిరునామాకు పంపాలి. 

*నోటిఫికేషన్ పూర్త సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు  https://prakasam.ap.gov.in వెబ్ సైట్ చూడొచ్చు.