ఇన్ స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ లో ఉద్యోగాలు.. విద్యార్హత ఇదే..

గుజరాత్ లోని గాంధీనగర్ లోని ఇన్ స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్(IPR) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*నోటిఫికేషన్ లో పేర్కొన్న ఉద్యోగాల సంఖ్య- 05.

*దరఖాస్తుకు చివరి తేది 2021 నవంబర్ 15.

*విద్యార్హతకు సంబంధించి గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. కంప్యూటర్ లో సర్టిఫైడ్ కోర్సుతో పాటు సంబంధింత పనిలో ఎక్స్ పీరియన్స్ కలిగి ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 25  ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 28 ఏళ్లు మించ కూడదు.

*నెలకు 19900 రూపాయల వేతనం చెల్లిస్తారు.

*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మెరిట్ వచ్చిన అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://www.ipr.res.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.