నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఉద్యోగాలు, భారీగా వేతనం

న్యూఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచీల్లో ఉన్న లా రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ మెయిల్ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగాల సంఖ్య- 27.

*దరఖాస్తుకు చివరి తేది 2021 నవంబర్ 01.

*దేశవ్యాప్తంగా వివిధ బెంచ్ లు ఉన్నాయి. న్యూఢిల్లీ, ముంబై, కోల్ కతా, హైదరాబాద్, అలహాబాద్, గువహటి, కటక్, అమరావతి బెంచ్ ల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*వయోపరిమితికి సంబంధించి 2021 నవంబర్ 01 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకి 40,000 రూపాయలు చెల్లిస్తారు.

*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి https://nclt.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.