వీరమరణం తర్వాత మహవీర్ చక్ర పురస్కారం అందుకున్న తెలంగాణ వ్యక్తి ఎవరో తెల్సా…

దేశ సంరక్షణలో గత సంవత్సరం గల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబును కేంద్రం మహావీర్ చక్ర పురస్కారంతో గౌరవించింది. ఈ అవార్డును సంతోష్ బాబు తల్లి, భార్య సంతోషి నవంబర్ 23న రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.  ఈ ఘర్షణలో సంతోష్‌బాబు సహా 21 మంది సైనికులు వీర మరణం పొందారు. ఈ తన భర్తకు మహావీరచక్ర పురస్కారం లభించడం గర్వంగా ఉందని కల్నల్‌ సంతోష్‌బాబు భార్య సంతోషి తెలిపారు.