బీటెక్, డిగ్రీ అర్హతలతో కేంద్ర మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు, రూ.1లక్ష 80వేల వరకు వేతనం..

ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి చెందిన నవరత్న సంస్థ NBCC ఇండియా లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*మొత్తం ఉద్యోగ  ఖాళీల సంఖ్య: 70

*దరకాస్తుకు చివరి తేది: 2022 జనవరి 01

*ఈ నోటిఫికేషన్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్(ఎలక్ట్రికల్), మెనేజ్ మెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజ్ మెంట్ ట్రయనీ, ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ స్టెనోగ్రాఫర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగానికి సంబంధించి ఎలక్ట్రానిక్ విభాగంలో ఇంజనీరింగ్ పాసై ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 33 ఏళ్ల వయస్సు దాటకూడదు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50000 నుంచి 160000 వేతనం చెల్లిస్తారు.

*మేనేజ్ మెంట్ ట్రెయినీ ఉద్యోగానికి సంబంధించి సివిల్, ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ పాసై ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 29 ఏళ్ల వయస్సు మించకూడదు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40000 నుంచి 180000 వరకు వేతనం చెల్లిస్తారు.

*ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగానికి సంబంధించి సివిల్ విభాగంలో బీటెక్ పాసై ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 47 ఏళ్ల వయస్సు మించకూడదు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60000 నుంచి రూ. 180000 వేతనం చెల్లిస్తారు.

*సీనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి సంబంధించి 28 ఏళ్ల వయస్సు మించకూడదు. అఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి 25 ఏళ్ల వయస్సు మించకూడదు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.nbccindia.com/ వెబ్ సైట్ ను చూడొచ్చు.