తెలంగాణ, డీఎంఈ లో మెడికల్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. భారీగా వేతనం..

హైదరాబాద్ లోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(DME).. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన 8 వైద్య కళాశాలల్లో కాంట్రాక్ట్ విధానంలో టీచింగ్ పోస్టింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*దరఖాస్తుకు చివరి తేది 2021 అక్టోబర్ 28.

*వైద్య కళాశాలల్లో వివిధ రకాల పోస్టులు  ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్, ఆసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*ఉద్యోగాలు 8 వైద్య కళాశాలల్లో ఉన్నాయి. జీఎంసీ వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండంలో పోస్టులు వెకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఎంబీబీఎస్, సంబంధిత విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌) పాసై ఉండాలి. టీచింగ్ లో అనుభవం కల్గి ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://dme.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..