యూఎస్‌ ఓపెన్‌ విజేత మెద్వెదెవ్‌, రికార్డుకు ఒక అడుగు దూరంలో జకోవిచ్

యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరు రసవత్తరంగా ముగిసింది. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచి చరిత్ర సృష్టిద్దామనుకున్న నొవాక్‌ జకోవిచ్‌ ఆశలు ఆవిరైపోయ్యాయి.  ఫైనల్‌ పోరులో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్‌ సంచలనం సృష్టించి, వరుస సెట్లలో ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు జకోవిచ్‌ను మట్టికరిపించాడు.

          ఆర్థర్‌ ఆషే స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్‌ 6-4, 6-4, 6-4 తేడాతో ఘన విజయం సాధించాడు. దీంతో మొదటిసారిగా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతా పడింది. దాదాపు పదేళ్ల తర్వాత యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో ఒక్కసెట్‌లో మాత్రమే ఓడిపోయి టైటిల్‌ గెలిచిన ఆటగాడిగా నిలిచి రికార్డు సృష్టించాడు. మెద్వెదెవ్‌కు ఇది మూడో గ్రాండ్ స్లామ్‌ ఫైనల్‌ కావడం విశేషం. గతంలో యూఎస్‌ ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరినప్పటికీ విజయం సాధించలేకపోయాడు.

ముగ్గురు వీరులు ఒకే నంబర్ వద్ద:

   అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించడానికి  జకోవిచ్‌ ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయాడు. జకోవిచ్‌ ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌ సరసన చేరాడు. ముగ్గురు టెన్నిస్‌ వీరులు ఒకే నంబర్‌ వద్ద ఆగిపోవడం గమనార్హం.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..