ఆంధ్రప్రదేశ్ లో మెగా జాబ్ మేళా… టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాస్ అయితే చాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులందరికీ శుభవార్త. అనంతపురంలోని ఎస్‌వీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తోంది.

           సెప్టెంబర్ 17న ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆసక్తి గల నిరుద్యోగులందరూ జాబ్ మేళాకు హాజరవ్వచ్చు. అమెజాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కియా మోటార్స్, టీసీఎల్, డిక్సన్ లాంటి కంపెనీలు తమ సంస్థల్లో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. మొత్తం 20 కంపెనీల్లో 1,295 ఉద్యోగాలున్నాయి.  రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ పోస్టులున్నాయి. అభ్యర్థులు https://apssdc.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాలి.

టెన్త్(పాస్, ఫెయిల్), ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్, ఎంటెక్ పాస్ అయిన అభ్యర్థులందరూ జాబ్ మేళాకు అర్హులు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..