హిందూఖుష్‌లో కరుగుతున్న హిమనీనదాలు

  • హిందూ ఖుష్‌ పర్వత శ్రేణులలో 2100 నాటికి 23 వంతు మంచు కరిగిపోతుందని, ఆగ్రేసియాలో 2 బిలియన్ల ప్రజలు, ఆహార, నీటికొరతను ఎదుర్కోవాల్సి రావచ్చునని ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ఒక పరిశోధనలో వెల్లడైంది.
  • హిందూ ఖుష్ పర్వత ప్రాంతాన్ని మూడో ధృవం (Third Pole)గా పేర్కొంటారు. భారతదేశం, నేపాల్, చైనా సహా ఎనిమిది దేశాలలో 3,500 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఇది అంటార్కిటికా మరియు ఆర్కిటికా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఘనీభవించిన నీటి నిల్వను కలిగి ఉంది.
  • ఈ హిమనీ నదాలు ఈ ప్రాంతంలో 10 ప్రధాన నదీ వ్యవస్థలకు ఆధారం. వీటిద్వారా వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పాదన వంటివి జరుగుతున్నాయి.
  • 2019లో International Centre for Integrated Mountain Development (ICIMOD) ఇచ్చిన నివేదిక ప్రకారం గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలకు పరిమితం చేసినా 21వ శతాబ్దం మొత్తం ఈ పర్వత శ్రేణి వేడెక్కుతుందని తెలిపింది.
  • హిమనీ నదాలు ద్రవీభవించడానికి మానవపరమైన చర్యలు కూడా కారణమవుతున్నాయని యూఎస్‌డీపీ నివేదిక వెల్లడించింది.
  • ఈ ప్రాంతంలోని దేశాలు కార్బన ఉద్ఘారాల విడుదలను తగ్గించడానికి నివేదిక విడుదల చేసింది. శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించడం, వ్యవసాయ విధానాలలో మార్పుల వంటి చర్యలు చేపట్టాలని సూచించింది.

క్రెడిట్: సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమి

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..