APPSCలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, దరఖాస్తుకు చివరి తేది ఇదే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త.  రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ గెజిటెడ్ కేటిగిరికి సంబంధించిన 38 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగాల సంఖ్య- 38.

*ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది -2021 నవంబర్ 12. చివరి తేది- డిసెంబర్ 7.

*వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.

  1. ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్లో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్-6,
  2. ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్- 29,
  3. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ లేబరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్లో ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్-1
  4. ఏపీ బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీస్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్- 2(ఉమెన్)- 2

* నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి https://psc.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..