CUG, గాంధీనగర్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు…

గుజరాత్ రాజధాని నగరం గాంధీనగర్ లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ (CUG).. నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగాల సంఖ్య-46.

*దరఖాస్తుకు చివరి తేది- 2021 అక్టోబర్ 29.

*నోటిఫికేషన్ లో వివిధ రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫైనాన్స్‌ ఆఫీసర్, లైబ్రేరియన్, సెక్షన్‌ ఆఫీసర్, అసిస్టెంట్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, హిందీ టైపిస్ట్‌ ఉద్యోగాలు ఖాళీగా  ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాలను అనుసరించి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌ టైపింగ్, కంప్యూటర్‌ నైపుణ్యాలు, సంబంధిత పని అనుభవం ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 30  నుంచి 57 ఏళ్ల లోపు మధ్య ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి https://www.cug.ac.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..