తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ విభాగంలో ఆఫీసర్ ఉద్యోగాలు…

తెలంగాణ రాష్ట్రం, వరంగల్ ప్రాంత పరిధిలో మహిళా, శిశు సంక్షేమ విభాగంలో.. ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 275

*దరఖాస్తుకు చివరి తేది: 2021 నవంబర్ 27.

*వివిధ జోన్ల వారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాళేశ్వరం–56, బాసర–68, రాజన్న–72, భద్రాద్రి–79  పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాలను అనుసరించి టెన్త్ క్లాస్, డిగ్రీ పాసై ఉండాలి. అంగన్‌వాడీ టీచర్లు(మెయిన్, మినీ)/కోఆర్డినేటర్లు/ఇన్‌స్ట్రక్టర్లు(అంగన్‌వాడీ ట్రెయినింగ్‌ సెంటర్లు/మిడిల్‌ లెవల్‌ ట్రెయినింగ్‌ సెంటర్లు)/కాంట్రాక్ట్‌ సూపర్‌వైజర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

*వయోపరిమితికి సంబంధించి 50 ఏళ్ల వయస్సు దాటకూడదు.

*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

* ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌ లో పరీక్ష కేంద్రాలున్నాయి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి https://wdcw.tg.nic.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.