ట్విట్టర్ CEO గా నియమితులైన భారత సంతతి వ్యక్తి..??

సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రాజకీయ నాయకులు, సినిమా హీరోల నుంచి కామన్ మ్యాన్ వరకు ట్విట్టర్ అకౌంట్ యూజ్ చేస్తారు. ప్రస్తుతం ట్విట్టర్ నూతన సీఈఓగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే  బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పరాగ్ అగర్వాలో ఆ పదవిలో కొనసాగనున్నారు. ఇంతక ముందు ఆయన ట్విట్టర్ కు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పనిచేశారు.