అమెరికాలో క్వాడ్‌ సదస్సులో ప్రసగించనున్న ప్రధాని మోదీ.

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో సెప్టెంబర్‌ 24న క్వాడ్‌ (Quadrilateral Security Dialogue-Quad) సదస్సు-2021 జరగనుంది. ఇందు కోసం ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సదస్సులో మోదీ ప్రసంగించనున్నారు.  క్వాడ్‌ సదస్సు, ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పాల్గొనడానికి మోదీ వెళుతున్నట్టుగా సెప్టెంబర్‌ 14న భారత విదేశాంగ శాఖ తెలిపింది.

        ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లైన అఫ్గాన్‌ సంక్షోభం, కోవిడ్‌ మహమ్మారి, స్వేచ్ఛాయుత ఇండో ఫసిఫిక్‌ విధానంపై నాలుగు దేశాల కూటమైన (అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా) క్వాడ్‌ సదస్సులో చర్చించనున్నారు. సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్, జపాన్‌ ప్రధాని యోషిడె సుగ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు పాల్గొననున్నారు. 2021, మార్చిలో ప్రకటించిన క్వాడ్‌ వ్యాక్సిన్‌పై వీరు సమీక్షించనున్నారు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..