AIIMS, ఢిల్లీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు..

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకి చెందిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం  ఉద్యోగ ఖాళీల సంఖ్య: 254

*ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2021 డిసెంబర్ 12. దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది: 2021 డిసెంబర్ 31.

*ఇందులో వివిధ రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ ఉద్యోగాలు వేకన్సీ ఉన్నాయి.

*వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. బ‌యోకెమిస్ట్రీ, అనాట‌మీ, కార్డియాల‌జీ, క్లినిక‌ల్ సైకాల‌జీ, ఎమ‌ర్జెన్సీ మెడిసిన్‌, యూరాల‌జీ, గ్యాస్ట్రో ఎంట్రాల‌జీ, న్యూరాల‌జీ, న్యూరో రేడియాల‌జీ విభాగాల్లో పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాలను బట్టి సంబంధిత విభాగాల్లో ఎంఎస్, ఎండీ, ఎంసీహెచ్, ఎండీఎస్, డీఎన్బీ, ఎమ్మెస్సీ, మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ కలిగి ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 50 సంవత్సరాలు దాటకూడదు.

*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.