NCLలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఇదే…

కేంద్ర ప్రభుత్వానికి చెందిన మహారాష్ట్రలోని పుణె నగరంలోని, సీఎస్ఐఆర్ పరిధిలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ(NCL) కాంట్రాక్ట్ విధానంలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది-2021 అక్టోబర్ 17.

*మొత్తం ఉద్యోగాల సంఖ్య-05.

  1. ప్రాజెక్ట్ అసోసియేట్2- 04 పోస్టులు

  2. ప్రాజెక్ట్ అసోసియేట్1- 01 పోస్ట్

*విద్యార్హతకు సంబంధించి మాస్టర్స్ డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ పాసై ఉండాలి. కమ్యూనికేషనల్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ వచ్చి ఉండాలి. సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 35 ఏళ్లకు మించరాదు.

*ఉద్యోగ ఎంపిక కోసం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఇంటర్వ్యూ తేది.. 2021 అక్టోబర్ 25.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి https://www.ncl-india.org వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..