UPSCలో ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలివే..

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగాల సంఖ్య-56.

* ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది- 2021 అక్టోబర్ 28.

*నోటిఫికేషన్ లో వివిధ రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌–01, ప్రైవేట్‌ సెక్రటరీ–01, సీనియర్‌ గ్రేడ్‌(ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌)–20, జూనియర్‌ టైం స్కేల్‌(జేటీఎస్‌)–29, యూత్‌ ఆఫీసర్‌–05 ఉద్యోగాలు వెకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాలను బట్టి ఆయా సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా పాసై ఉండాలి.

* ట్రాన్స్‌స్క్రిప్షన్‌, టైపింగ్ నైపుణ్యాలతో పాటు సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ కల్గి ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి  30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కల్గి ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి www.upsc.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..