NCMRWF, నోయిడాలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు

ఉత్తరప్రదేశ్, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ (NCMRWF) కాంట్రాక్ట్ విధానంలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం పోస్టుల సంఖ్య -46.

*దరఖాస్తుకు చివరి తేది 2021 అక్టోబర్ 25.

*విద్యార్హతకు సంబంధించి ఆయా సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పాస్ అవ్వాలి. సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ కల్గి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 40, 45 ఏళ్లు మించకూడదు.

*ఉద్యోగాలను అనుసరించి వేతనం 67000, 78000రూపాయలతో పాటు హెచ్ఆర్ఏ చెల్లిస్తారు.

*ఉద్యోగ ఎంపిక కోసం షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.ncmrwf.gov.in/ వెబ్ సైట్ ను సందర్శింవచ్చు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..