పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా రమీజ్ రాజా, కోచ్ గా మ్యాథ్యూ హేడెన్

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌గా పాక్‌ జట్టు మాజీ కెప్టెన్‌ రమీజ్‌ రాజా  ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు ఆయన పదవీకాలానికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎహ్‌సాన్‌ మని గత నెలలో పీసీబీ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త చైర్మన్‌ గా రమీజ్ రాజా కొనసాగనున్నారు. 1992 వన్డే వరల్డ్‌కప్‌ విజేత పాక్‌ జట్టు సభ్యుడైన రమీజ్‌ 2003–2004 వరకు పీసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు.

 పాక్ జట్టు కోచ్ గా మ్యాథ్యూ హేడెన్: 

       పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కోచ్‌లుగా ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్‌ మ్యాథ్యూ హేడెన్, దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ ఫిలాండర్‌లను నియమిస్తున్నట్లు పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రాజా సెప్టెంబర్‌ 13న ప్రకటించారు. వచ్చే నెలలో టి20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో వీరిద్దరినీ తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాక్‌ జట్టు కోచ్‌లుగా వీరు ఎప్పటి వరకు కొనసాగుతారనే విషయంపై రమీజ్‌ స్పష్టతనివ్వలేదు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..