డచ్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకున్న రెడ్‌బుల్‌ డ్రైవర్‌

ఫార్ములావన్‌ (ఎఫ్‌1) రేసు డచ్‌ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌(నెదర్లాండ్స్‌) విజేతగా నిలిచాడు. నెదర్లాండ్స్‌లోని జాండ్‌వోర్ట్‌లో సెప్టెంబర్‌ 5న జరిగిన ప్రధాన రేసులో వెర్‌స్టాపెన్‌…  72 ల్యాప్‌ల దూరాన్ని అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 05.395 సెకన్లలో చేరుకుని విజేతగా అవతరించాడు.

        సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కిది ఏడో విజయం కాగా… ఓవరాల్‌గా 17వది. 20.932 సెకన్లు వెనుకగా రేసును ముగించిన హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో నిలిచాడు. మరో మెర్సిడెస్‌ డ్రైవర్‌ బొటాస్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. తాజా విజయంతో వెర్‌స్టాపెన్‌… డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని(224.5 పాయింట్లతో) అందుకున్నాడు. మూడు పాయింట్ల తేడాతో లూయిస్‌ హామిల్టన్‌ (221.5) రెండో స్థానంలో ఉన్నాడు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..