వన్డేల్లో సరికొత్త రికార్డు..

అంతర్జాతీయ వన్డేల్లో మరో రికార్డు నమోదైంది. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా అమెరికాకు చెందిన  జస్కరన్‌ మల్హోత్రా, హర్షల్ గిబ్స్ సరసన  నిలిచాడు. ఒమన్‌లోని అల్‌ అమీరట్‌లో సెప్టెంబర్‌ 9న పపువా న్యూ గినియాతో జరిగిన రెండో వన్డేలో ఈ ఘనత చోటు చేసుకుంది.

                 పపువా న్యూగినియా కు చెందిన మీడియం పేసర్‌ గాడీ టోకా వేసిన 50వ ఓవర్లో జస్కరన్‌ వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా 134 పరుగుల తేడాతో గెలిచింది. చండీగఢ్‌లో పుట్టి వలస వెళ్లిన జస్కరన్‌ అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

                     2007 వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో డాన్‌ వాన్‌ బంగ్‌ ఓవర్లో హెర్షల్‌ గిబ్స్‌ 6 సిక్సర్లు కొట్టగా… అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్‌ సింగ్, కీరన్‌ పొలార్డ్‌ ఈ అరుదైన ఫీట్‌ను సాధించారు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..