AIIMS, రాయ్ పూర్ లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు..

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధించిన రాయ్ పూర్ లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS), సీనియర్ రెసిడింట్లు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య- 136.

*దరఖాస్తుకు చివరి తేది 2021 నవంబర్ 7

* పలు విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అనెస్తీషీయాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, మైక్రోబయాలజీ విభాగాల్లో పోస్టులు వెకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాలను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పాసై ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 45 ఏళ్లు మించకూడదు.

*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.aiimsraipur.edu.in/ వెబ్ సైట్ సందర్శించవచ్చు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..