ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన భారత వనిత

2021, ఆగస్టు 30న 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌ –1 విభాగంలో స్వర్ణం సాధించిన 19 ఏళ్ల అవనీ… సెప్టెంబర్‌ 3న 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఎస్‌హెచ్‌–1 ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. దీంతో పారాలింపిక్స్‌ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన మహిళల షూటింగ్‌ 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌ ఫైనల్లో రాజస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల అవని… 445.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది.

రెండో భారతీయ ప్లేయర్‌…
ఒకే పారాలింపిక్స్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పతకాలు నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్‌ అవని. 1984 పారాలింపిక్స్‌లో జోగిందర్‌ సింగ్‌ మూడు పతకాలు గెలిచాడు. ఆయన షాట్‌పుట్‌లో రజతం, జావెలిన్‌ త్రోలో కాంస్యం, డిస్కస్‌ త్రోలో కాంస్యం సాధించాడు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..