ఇండియ‌న్ నేవీలో ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్లు

SSC officers in the Indian Navy

ఇండియ‌న్ నేవీ స్పెషల్‌ నావల్‌ ఓరియంటేషన్‌ కోర్సు(JAN 2022(ST 22)) కింద ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్(ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి అవివాహిత పురుషుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నది.
మొత్తం ఖాళీలు: 45
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌ – ఎస్ఎస్‌సీ ఎక్స్ (ఐటీ)
కోర్సు ప్రారంభం: జనవరి 2022 (ఎస్‌టీ 22)
శిక్ష‌ణ కేంద్రం: ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ (ఐఎన్ఏ), ఎజిమ‌ల, కేర‌ళ‌
అర్హ‌త‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి కనీసం 60% మార్కులతో కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ ఐటీలో బీఈ/ బీటెక్‌ (లేదా) ఎమ్మెస్సీ (కంప్యూటర్/ ఐటీ)/ ఎంసీఏ/ ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ) ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.
వ‌య‌స్సు: 2 జ‌న‌వ‌రి 1997 & 1 జూలై 2002లో జ‌న్మించి ఉండాలి.
ఎంపిక: అక‌డ‌మిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌కు ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ల‌ను నిర్వ‌హిస్తారు.
గ‌మ‌నిక‌: ఈ సారి కోవిడ్‌-19 కార‌ణంగా ఇండియ‌న్ నేవీ ఎంట్ర‌న్స్ టెస్ట్ నిర్వ‌హించ‌డం లేదు.
ఎస్ఎస్సీ (ఐటీ) అధికారులు నావల్ అకాడమీలో 4 వారాలపాటు నావల్ ఓరియంటేషన్ కోర్సు ఎజిమల నిర్వ‌హిస్తారు. దీని తర్వాత నావల్ షిప్స్, నియంత్రణ శిక్షణా సంస్థల్లో ప్రొఫెషనల్ శిక్షణ ఉంటుంది
ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ : 2021 ఆగస్టులో బెంగళూరు / భోపాల్ / విశాఖపట్నం / కోల్‌కతాలో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: జూలై 2, 2021.
చివ‌రితేదీ: జూలై 16,2021
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..