అంతర్జాతీయ హాకీకి గుడ్ బై చెప్పిన స్టార్ ప్లేయర్

భారత్ స్టార్ హాకీ ప్లేయర్ ఎస్వీ సునీల్ తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అక్టోబర్ 1న యువకులకు అవకాశమివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునిల్ చెప్పాడు.

                     14 ఏళ్ల కెరీర్ లో సునీల్ 264 మ్యాచ్ ల్లో భారత్ కు ప్రాతినిథ్యం వహించి 72 గోల్స్ చేశాడు. ఇటీవల జరిగిన టోక్యో ఒలంపిక్స్ కు మాత్రం సునీల్ ఎంపిక కాలేదు. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత్ టీంలో సునీల్ పాలు పంచుకున్నాడు.