కేరళలో SCTIMSTలో టెక్నీషియన్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు…

కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన కేరళలోని తిరువనంతపురం కి చెందిన శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ(SCTIMST) కాంట్రాక్ట్ విధానంలో టెక్నీషియన్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య-12.

*ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2021 నవంబర్ 09

*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్ తో పాటు, సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ సాధించి ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 2021 నవంబర్ 01 నాటికి 30 ఏళ్లు దాటరాదు.

*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ మార్కులు వచ్చిన వారిని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.sctimst.ac.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..