దేశంలోనే తొలి ఈ-ఓట్ ఆ రాష్ట్రంలో…..

దేశంలోనే మొదటి సారిగా స్మార్ట్ ఫోన్ ను యూజ్ చేసి ఎక్కడ నుంచైనా ఓటు వేసే ఈ-ఓట్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రం ప్రయత్నించనుంది. రాష్ట్ర  ఎన్నికల సంఘం, రాష్ట్ర ఐటీ శాఖలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం కలిసి కనుగోన్న ఈ-ఓట్ విధానాన్ని రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నుంచి మొదటి సారిగా పరిశీలించనున్నారు.

      ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఎలాంటి ఎన్నికలు లేనప్పటికి ఈ- ఓటు విధానం ఎంత వరకు సఫలీకృతం అవుతుందో గుర్తించనున్నారు.అక్టోబర్ 20న ఓటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. అక్టోబర్ 8 నుంచి 18 వరకు పది రోజులు ఈ-ఓట్ నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ  ఓటింగ్ లో పాల్గొనాలంటే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో TS EVOTE యాప్ ను డౌన్ లోడ్  చేసుకోవాలి. ఓటింగ్ ప్రక్రియను ఏ విధంగా నమోదు చేసుకోవాలో సంబంధించిన కొన్ని వీడియోలను అందుబాటులో ఉంచారు.