టీ20 వరల్డ్ కప్ కు సూపర్ టీంను ప్రకటించిన సెలక్షన్ కమిటీ

టి20 వరల్డ్‌కప్‌–2021కు భారత్ జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. 15 మంది సభ్యుల పేర్లను సెలక్షన్ బోర్డు ప్రకటించింది. విరాట్‌ కోహ్లి సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ నేతృత్వం వహించనున్నాడు. ముగ్గురు రిజర్వ్‌ ఆటగాళ్లను కూడా టీమ్‌లోకి ఎంపిక చేశారు. జట్టుకు రవిశాస్త్రి హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

మెంటార్ పాత్రలో ధోని:

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన ఎమ్మెస్‌ ధోని ఈసారి కొత్తగా ‘మెంటార్‌’ పాత్రలో జట్టుతో కలిసి పని చేయనున్నాడు. ఒమన్, యూఏఈలలో 2021, అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు ఈ మెగా టోర్ని జరగనుంది.

భారత టి20 జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, సూర్యకుమార్, పంత్, ఇషాన్‌ కిషన్, హార్దిక్, జడేజా, రాహుల్‌ చహర్, అశ్విన్, అక్షర్‌ పటేల్, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్, షమీ. స్టాండ్‌బై: శ్రేయస్‌ అయ్యర్, దీపక్‌ చహర్, శార్దుల్‌ ఠాకూర్‌.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..