పంటల వృద్ధి రేటులో దూసుకెళ్తున్న ఆ రాష్ట్రాలు…

దేశంలో గడిచిన పదేళ్లలో వ్యవసాయ పంటల వృద్ధి రేటులో త్రిపుర రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. 6.87 వృద్ధి రేటుతో త్రిపుర తొలి స్థానంలో నిలవగా, 6.59 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. తెలంగాణతో సమానంగా సిక్కిం రెండో స్థానంలో ఉంది.

                      పెద్ధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. 2011-20 మధ్య కాలంలో దేశంలో రాష్ట్రాలు సాధించిన పురోగతి, వృద్ధిపై రూపొందించిన విశ్లేషణ పత్రంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

విశ్లేషణ పత్రంలో కొన్ని ముఖ్యాంశాలు: 

దేశంలో కేవలం 11 రాష్ట్రాల్లోనే 3 శాతానికి మించి సగటు పంటల వృద్ధి రేటు నమోదైంది. మహిళలు 73 శాతం వ్యవసాయ రంగంలోనే పనిచేస్తున్నారు. ఉద్యానం, పాడి, పశుసంవర్ధక తదితర అనుబంధ రంగాల వృద్ధి రేటులో ఆంధ్ర ప్రదేశ్ 2వ స్థానం, తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది.