దేశంలో అత్యధిక, అత్యల్పంగా పేదలున్న రాష్ట్రాలేవి..??

దేశంలో అత్యధికంగా, అత్యల్పంగా పేదలున్న రాష్ట్రాల జాబితాను నీతి ఆయోగ్ వెల్లడించింది. అంతక ముందు పేదరికాన్ని ఆదాయం, వినియోగం, ఖర్చు ఆధారంగా అంచనా వేయగా, ఇప్పుడు విద్య, వైద్యం, ప్రజల జీవన స్థితిగతుల ఆధారంగా అంచనా వేశారు.

*దేశంలో అత్యధికంగా పేదలు ఉన్న రాష్ట్రంగా బీహార్ మొదటి స్థానంలో ఉంది. బీహార్ సగానికి పైగా పేదలు ఉన్నారని నీతిఅయోగ్ పేర్కొంది. 51.91 శాతం మంది పేదలు ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

*అత్యధికంగా పేదలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 18వ స్థానంలో ఉంది. తెలంగాణలో 13.74 శాతం మంది పేదలు  ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ 20 వ స్థానంలో ఉంది.

*అతి తక్కువ పేదరికం  ఉన్న రాష్ట్రాల్లో కేరళ, గోవా, సిక్కిం, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు  ఉన్నాయి.