రూ. లక్ష విలువైన సివిల్స్ కోచింగ్ ను ఉచితంగా ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం

పేద, మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టి సివిల్స్ కొట్టాలనే వారికి ఇది సువర్ణావకాశం. డబ్బులు లేక కోచింగ్ వెళ్లలేకుండా, స్టడీ మెటీరియల్ కొనలేని పరిస్థితుల్లో  ఉన్నవారికి ఇది గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం బీసీ అభ్యర్థులకు ఐఏఎస్ ఎక్స్ప్ ఫర్ట్స్ తో కొచింగ్ ఇవ్వనుంది.

ముఖ్య వివరాలు: 

*కోచింగ్ కు అర్హత సాధించాలంటే ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు.

*అందులో పాస్ అయినవారికి ఫ్రీ కోచింగ్ ఇవ్వనుంది.

*సివిల్స్ ప్రిపరేషన్ కు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను కూడా ఉచితంగా అందివ్వనుంది.

*అర్హత గల అభ్యర్థులు ఈ నెల 27వ తేది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

*దీనికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు.

*అభ్యర్ధులు http://tsbcstudycircle.cgg.gov.in  వెబ్ సైట్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

* వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్ 040 -24071178ను సంప్రదించవచ్చు.