యూపీఎస్సీ‍ ఎన్‌డీఏ & ఎన్ఏ (2) ఎగ్జామ్‌-2021

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహించే 148వ కోర్సు నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ(ఎన్‌డీఏ) 110వ ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మి కోర్సుల్లో(ఎన్ఏ) ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నది.
మొత్తం ఖాళీలు: 400
నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మి(ఎన్‌డీఏ): 370 ఖాళీలు ( ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్ ఫోర్స్‌-120)
నేవ‌ల్ అకాడ‌మీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌)-30 ఖాళీలు
అర్హతలు: ఆర్మీ వింగ్ పోస్టుల‌కు ఇంట‌ర్మీడియట్(10+2) లేదా సమాన ప‌రీక్షలో ఉత్తీర్ణత‌. ఎయిర్ ఫోర్స్‌, నేవ‌ల్ వింగ్స్ పోస్టుల‌కు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ‌మెటిక్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియట్(10+2) ఉత్తీర్ణత. ఇంట‌ర్మీడియట్ సెకండ్‌(ఫైన‌ల్‌) ఇయ‌ర్ ప‌రీక్షలు రాస్తున్న/ హాజ‌ర‌వుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు.
వ‌య‌స్సు: 2003 జ‌న‌వ‌రి 2 నుంచి 2006 జ‌న‌వ‌రి 1 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
పే స్కేల్‌: రూ.56,100 ( ఫిక్స్‌డ్ స్టయిఫండ్ క్యాడెట్‌ ట్రెయినింగ్‌లో)
ట్రెయినింగ్‌: మూడు సేవలకు ఎంపికైన అభ్యర్థులు ఆర్మీ, నేవీ & వైమానిక దళానికి నేషనల్ డిఫెన్స్ అకాడ‌మి(ఇంటర్ సర్వీస్ సంస్థ)లో ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఈ అకాడ‌మిలో మూడేండ్లపాటు విద్యా మరియు శారీరక ప్రాథమిక శిక్షణ ఉంటుంది. మొదటి రెండున్నర ఏండ్లపాటు అభ్యర్థులకు సాధారణ వింగ్‌లో శిక్షణ ఉంటుంది. ఆత‌ర్వాత అభ్యర్థులందరికీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఢిల్లీ నుంచి డిగ్రీలు ప్రదానం చేస్తారు.
(ఎ) ఆర్మీ క్యాడెట్లు – B.Sc/ B.Sc (కంప్యూటర్) / B.A.
(బి) నావల్ క్యాడెట్లు – బి.టెక్ డిగ్రీ*
(సి) వైమానిక దళం క్యాడెట్లు – బి.టెక్ డిగ్రీ */ బి.ఎస్.సి./ బి.ఎస్.సి.(కంప్యూటర్)
ఎంపిక‌: రాత‌ప‌రీక్ష, ఎస్ఎస్‌బీ టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా
రాత‌ప‌రీక్షలో భాగంగా మొత్తం 5గంటల ఎగ్జామినేష‌న్ నిర్వహిస్తారు.
గణితం(పేప‌ర్‌1): 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు- 2 ½ గంటలు-300 మార్కులు
జనరల్ ఎబిలిటీ టెస్ట్ (GAT) -(పేప‌ర్‌2): 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు- 2 ½ గంటలు- 600 మార్కులు
రాత ప‌రీక్ష సిల‌బ‌స్‌:
గణితం: బీజగణితం, మాత్రికలు మరియు నిర్ణాయకాలు, త్రికోణమితి, రెండు, మూడు కోణాల విశ్లేషణాత్మక జ్యామితి, అవకలన కాలిక్యులస్, వెక్టర్ ఆల్జీబ్రా, గణాంకాలు మరియు సంభావ్యత
GAT: ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, జియోగ్రఫీ, కరెంట్ ఈవెంట్స్ మొదలైనవి.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంతోపాటు దేశ‌వ్యాప్తంగా 42 కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.100(ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు)
ప్రారంభం: జూన్ 9
చివరి తేదీ: జూన్ 29
పరీక్ష తేదీ: సెప్టెంబ‌ర్ 5, 2021
వెబ్‌సైట్‌: www.upsconline.nic.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..